పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేపు హైకోర్టు తీర్పు
21:02 January 20
రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. రేపు ఉదయం 10.30 గంటలకు హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఎస్‌ఈసీ పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన న్యాయస్థానం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ వాదనలు వినింది. అనంతరం ఈ నెల 18న తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి