ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపాధి హామీ బకాయిల చెల్లింపులో జాప్యమెందుకు..? హైకోర్టు - ఏపీలో ఉపాధి హామీ బకాయిల విడుదలు

ఉపాధి హామీ బకాయిల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు ఇవ్వకుండా ఆ తర్వాత చేసిన వాటికి ఎలా చెల్లిస్తారని నిలదీసింది.

ఏపీ హైకోర్టు
MGNREGS wage arrears iల ోజ

By

Published : Mar 31, 2021, 5:54 AM IST

ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. పనులే చేయకపోతే కూలీలకు సొమ్ము ఎలా చెల్లించారని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులకు ఇవ్వకుండా ఆ తర్వాత చేసిన వాటికి ఎలా చెల్లిస్తారని నిలదీసింది. కేంద్రం నుంచి నిధులు రాకపోతే 2019-20 ఆర్థిక సంవత్సర పనులకు బిల్లులెలా చెల్లించారని ప్రశ్నించింది. రూ.5 లక్షల లోపు విలువ చేసే పనులకు 20% సొమ్మును మినహాయించి బకాయిలు చెల్లిస్తామని కోర్టుకు తెలిపినా.. ఎందుకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదే ధోరణి కొనసాగితే ఉన్నతాధికారులను కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణ నాటికి కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించాలని తేల్చిచెప్పింది. చెల్లింపు వివరాలు కోర్టుకు తెలిపేందుకు విచారణను ఏప్రిల్‌ 23కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఉపాధి హామీ పథకం కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు పి.వీరారెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్‌, న్యాయవాదులు ఎస్‌.ప్రణతి, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

గుత్తేదారులకు కాదు.. స్థానిక సంస్థలకు
‘ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2018 అక్టోబరు నుంచి 2019 మార్చి వరకు చేపట్టిన పనులకు బిల్లుల్ని నిలిపేసింది. కేంద్రప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పాత పనులకు బిల్లులు నిలిపేశారు. గతంలో నిర్వహించిన పనులకు కొలతలు తీసి, సామాజిక తనిఖీ చేసి, ఎం బుక్‌లో పొందుపరిచినా.. విచారణ పేరుతో చెల్లింపులు నిలిపేశారు. విడుదల కావాల్సిన బకాయిలు గుత్తేదారులకు చెందుతాయని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) చెప్పడంలో వాస్తవం లేదు. అవి స్థానిక సంస్థలకు చెందుతాయి’ అన్నారు.

చెల్లింపు ప్రక్రియలో ఉంది: జీపీ
ప్రభుత్వం తరఫున జీపీ సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘కూలీలకు ఇవ్వాల్సిన సొమ్మును చెల్లించాం. మెటీరియల్‌ కాంపొనెంట్‌ చెల్లించాల్సి ఉంది. మొత్తం 7.94 లక్షల పనులు జరిగాయి. గతంలో జరిగిన పనులపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేసి.. అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేల్చింది. 4,338 పనుల విషయంలో సొమ్ము తిరిగి రాబట్టాలని సూచించింది. ఉపాధి పనులకు కేంద్రం నుంచి నిధులు రావాలి. చెల్లించాల్సిన బకాయిలు గుత్తేదారులకు చెందుతాయి గానీ, పంచాయతీలకు చెందవు. రూ.5లక్షల పైబడి విలువ చేసే పనులకు ఎంత చెల్లించాలనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.

ఇదీ చదవండి

ఏప్రిల్​ 1 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details