ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మావోయిస్టులకు మద్దతుగా పిల్ వేస్తారా...?: హైకోర్టు - ap high court on maoist related petition

మావోయిస్టుల కూంబింగ్ పేరుతో ఇద్దరు గిరిజనులను పోలీసులు హత్యా చేశారని...వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను విచారించిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎంతోమంది పోలీసులను నక్సలైట్లు హతమారుస్తున్నారని...వారి చేతుల్లో చనిపోయిన పోలీసుల కోసం ఎవరైనా పిటిషన్లు వేశారా..? ఆ కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా...? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ap high court
ap high court

By

Published : Sep 2, 2020, 5:10 AM IST

ఎంతోమంది పోలీసులను హత మారుస్తూ, దేశంపై యుద్ధం ప్రకటిసున్న మావోయిస్టులకు మద్దతుగా పిల్ వేస్తారా...? అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వారి చేతుల్లో చనిపోయిన పోలీసుల కోసం ఎవరైనా పిటిషన్లు వేశారా..? ఆ కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా...? అని ప్రశ్నించింది.మావోయిస్టుల కూంబింగ్ పేరుతో అమాయకులైన ఇద్దరు గిరిజనులను 2012 మే 10న పోలీసులు కాల్చిచంపారని, బాధ్యులైన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యక్షుడు అక్బర్ 2012 జులైలో పిల్ వేశారు.

ఏ అర్హతతో వేశారు...?

ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వం న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ (పార్టీ ఇన్ పర్సన్) గతంలో మూడు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. ఓ అనుబంధ పిటిషన్లోని అభ్యర్ధనను సవరించాలని ధర్మాసనం పిటిషనర్ కు తెలిపిందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. 2012 లో దాఖలైన వ్యాజ్యంలో ప్రస్తుతం అనుబంధ పిటిషన్లు వేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిషనర్ ఏ అర్హతతో 'విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ పేరిట' వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశ్నించింది.

ఆ ఉద్దేశ్యంతో చేశారా...?

నక్సలైట్లను రక్షించాలన్న ఉద్దేశంతో ఈ వ్యాజ్యం దాఖలు చేశారా..? అని ఆరా తీసింది. దీనిపై విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించింది.ఎంతోమంది పోలీసులను నక్సలైట్ల హతమారుస్తున్నారని.. దేశంపై వారు యుద్ధం ప్రకటిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తులకు మద్దతుగా పిల్ వేస్తారా..? చనిపోయిన పోలీసుల కోసం ఎవరైనా పిటిషన్లు వేశారా..? ఆ కుటుంబాల్ని ఎవరైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించింది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో నక్సలైట్ల కార్యక్రమాల గురించి అందరికి తెలుసంది. పిటిషనర్ తరపు న్యాయవాది విచారణకు హాజరుకాకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

'సుశాంత్​ కేసు మీడియా సర్కస్​గా మారిపోయింది'

ABOUT THE AUTHOR

...view details