స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. గత విచారణలో రాజ్యాంగ సంస్థలకు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
నిధుల కోసం.. ఎస్ఈసీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ - నిధులు విడుదలపై ఏపీ ఈసీ పిటిషన్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈసీకి ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని ఎన్నికల కమిషనర్ పిటిషన్ వేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్‌లో ఉంచింది.
Ap high court
Last Updated : Oct 22, 2020, 6:21 PM IST