ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోడి పందేలు  నిర్వహించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? - latest news of AP high court

కోడి పందేలను అడ్డుకోవడంలో కోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందులో ప్రతివాదిగా ఉన్న ఎంపీ రఘురాంకృష్ణం రాజుకు నోటీసులు జారీ చేసింది.

ap-high-court-questions-to-govt-on-prevent-of-kodi-pandealu

By

Published : Oct 17, 2019, 4:16 AM IST



కోడి పందేలను నిలువరిస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వులకనుగుణంగా కలెక్టర్లు , ఎస్పీలు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది . కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ కోడి పందేలు ఆడినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీచేసింది. విచారణను 3వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిలువరిస్తూ 2016 డిసెంబర్​లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ 2018లో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం. . కోర్టు ఆదేశాల్ని అమలు చేసి తీరాల్సిందేనని అధికారులకు స్పష్టంచేసింది . వ్యాజ్యంలో ప్రతివాదుల జాబితాలో ఉన్న రఘురామకృష్ణరాజుకు నోటీసులు అందలేదని మరోసారి నోటీసులిచ్చింది .

ABOUT THE AUTHOR

...view details