ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రామ న్యాయాలయాల ఏర్పాటు మీ బాధ్యత కాదా?: హైకోర్టు - ap high court question to andhrapradesh governament over grama courts

గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయటం మీ బాధ్యత కాదా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయాలయాల ఏర్పాటుపై పురోగతి లేకపోవడమేంటని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది స్పందన్న విన్న ఉన్నత న్యాయస్థానం..తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది

ap high court question to govt on establishnent of grama nayalayams

By

Published : Oct 23, 2019, 11:57 PM IST


గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయటం మీ బాధ్యత కాదా ? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై గతేడాదిలో పిల్ దాఖలైనప్పటికీ న్యాయాలయాల ఏర్పాటుపై పురోగతి లేకపోవటమేంటని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ... హైకోర్టు పరిపాలనా అనుమతుల కోసం త్వరలో లేఖ రాయనున్నామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ టి. రజనీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. గ్రామ న్యాయాలయాల చట్టం -2008 ప్రకారం రాష్ట్రంలో న్యాయాలయాలు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన బిక్షం అనే వ్యక్తి 2018 లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

గ్రామ న్యాయాలయాల ఏర్పాటు మీ బాధ్యత కాదా?: హైకోర్టు
ఇదీ చదవండి: 'కేసులున్న వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారు?'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details