ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన జీవో 43పై హైకోర్టు విచారణ జరిపింది. రిజర్వేషన్ సీట్ల కేటాయింపులో కొన్ని వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... కౌన్సెలింగ్‌కు సంబంధించి మరో జీవో విడుదల చేశామని న్యాయస్థానానికి తెలిపారు. పిటిషనర్ కోరిన విధంగా సవరణలు చేశామని వివరించారు. ఇరువైపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.
'పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి కొత్త జీవో ఇచ్చాం' - ntr health university
జీవో 43పై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. సీట్ల కేటాయింపుల్లో కొన్ని వర్గాల విద్యార్థలకు అన్యాయం జరుగుతోందని పిటిషనర్ వాదనలు వినిపించగా... కౌన్సెలింగ్ విషయంలో కొత్త జోవో విడుదల చేశామని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ జూన్ 15కు వాయిదా పడింది.
ntr university medical seats