కొవిడ్ నివారణకు ప్రభుత్వం ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కరోనా పరీక్షల నివేదికలు త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించింది. కొవిడ్ చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. కొవిడ్ చికిత్స పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి.. కొవిడ్ చికిత్స పర్యవేక్షించాలని సూచించింది.
'కరోనా పరీక్షల నివేదికలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోండి' - ap high court on corona cases in ap
కరోనా పరీక్షల నివేదికలు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ చికిత్స పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
ap high court orders to state government on corona regulations
కొవిడ్ ఆస్పత్రిలో రోగులు, పడకల వివరాలు ప్రదర్శించాలని ధర్మాసనం ఆదేశించింది. నోడల్ అధికారులను నియమించాలని.. నోడల్ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలని హైకోర్టు పేర్కొంది.
ఇదీ చదవండి:ప్రజల ప్రాణాలు హరించి.. శ్మశానాలకు రాజులుగా ఉంటారా?: చంద్రబాబు