అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ ముగిసింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారణకు హాజరయ్యారు. పోలీసులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
సీజ్ చేసిన వాహనాలపై మూడ్రోజుల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు - హైకోర్టు హాజరైనా ఏపీ డీజీపీ సవాంగ్
అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన డీజీపీ.. వివరణ ఇచ్చారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం... ఎస్‌హెచ్‌వోల పనితీరు బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడ్రోజుల్లోగా సీజ్ చేసిన వాహనాలను ఎస్‌హెచ్‌వోలు, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
కొంతమంది ఎస్‌హెచ్‌వోల పనితీరు బాగాలేదని హైకోర్టు అభిప్రాయపడింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తే ఏజీపీతో మెమో ఫైల్ చేయించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాహనాలను 3 రోజుల్లోగా ఎస్‌హెచ్‌వోలు, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించింది. వాహనదారులు వెంటనే డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. సీజ్ చేసిన వాహనాలపై మూడ్రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి :వాహనాల విడుదల కేసు: హైకోర్టు విచారణకు హాజరైన డీజీపీ