ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కోర్టు ధిక్కరణపై కౌంటర్​ దాఖలుకు చివరి అవకాశం'

న్యాయవ్యవస్థపై పోస్టింగుల విషయంలో సుమోటోగా దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కొంతమంది కౌంటరు దాఖలు చేయడానికి చివరి అవకాశంగా 30 రోజుల గడువిచ్చింది.

social media posts against judges
social media posts against judges

By

Published : Oct 16, 2020, 4:20 AM IST

న్యాయవ్యవస్థపైన సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టింగులు పెట్టి, చర్చలు జరిపిన 93 మందిపై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై... గురువారం హైకోర్టు విచారణ జరిపింది. కొంతమంది కౌంటరు దాఖలు చేయడానికి చివరి అవకాశంగా 30 రోజుల గడువిచ్చింది. ఆ లోపు కౌంటరు వేయకపోతే దాఖలు చేయడానికి ఆసక్తి లేనివారిగా భావించి విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జెేకే మహేశ్వరి, జస్టిస్‌ కె. లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

వైకాపా ఎంపీ నందిగం సురేశ్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్​రెడ్డి, పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు, తదితరులు కోర్టుధిక్కరణ జాబితాలో ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details