రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు - ఎస్ఈసీపై ఏపీ హైకోర్టు
11:53 November 03
ప్రభుత్వం సహకరించట్లేదని ఎస్‌ఈసీ వేసిన పిటిషన్‌పై విచారణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సహకరించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం సహకరించట్లేదని ఎస్‌ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. 15 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో హైకోర్టు.. సుమోటోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి ఏ విధమైన సహాయం చేసింది.. ఇంకా ఎలా చేయాలనే విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: