ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"పోలవరం భూ నిర్వాసితుల దస్త్రాలు, రికార్డులు ఇవ్వండి" - news of poavaram project

పోలవరం ప్రాజెక్టు భూనిర్వాసితులైన గిరిజనులకు దక్కాల్సిన పరిహారాన్ని గిరిజనేతరులు పొందారని 2018లో దాఖలైన పిటిషన్​ పై.. హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారుల నుంచి దస్త్రాలు, రికార్డులు పొందేందుకు పిటిషనర్​కు అనుమతిచ్చింది.

ap-high-court-on-polavaram-over-irregularities-in-the-payment-of-compensation-for-tribles

By

Published : Oct 17, 2019, 9:14 AM IST

దస్త్రాలు, రికార్డులు పిటిషనర్​కు ఇవ్వండి: హైకోర్టు

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో గిరిజనులకు దక్కాల్సిన పరిహారాన్ని.. గిరిజనేతరులు పొందారనే ఆరోపణల నేపథ్యంలో అధికారుల నుంచి దస్త్రాలు, రికార్డులు పొందేందుకు పిటిషనర్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. రికార్డులను పరిశీలించాలని కోరితే అనుమతించాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ ఎం . సీతారామమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి , బుట్టాయిగూడెం , పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని గిరిజనులు భూములిచ్చినా ... వారి స్థానంలో గిరిజనేతరులు అక్రమంగా పరిహారం పొందారని... అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదని పేర్కొంటూ పి. శివరామకృష్ణ 2018లో పిల్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details