ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయాల్లో 'మీ సేవలు' జీవో అమలు నిలిపివేత - high court fires on government

మీ సేవ కేంద్రాల్లో అందించే సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 22 అమలును హైకోర్టు నిలిపేసింది. వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా... న్యాయస్థానం అంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ap high court on meeseva services
సచివాలయాల్లో 'మీసేవలు' జీవో అమలు నిలిపివేత

By

Published : Feb 5, 2020, 6:50 AM IST

మీ సేవ కేంద్రాల్లో అందించే సేవలను సచివాలయాల్లో అందించేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 22 అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు. డిసెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 22ను సవాలు చేస్తూ మీసేవ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్, కడప జిల్లా గ్రామీణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేంద్రబాబు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. తాము అందించే సేవల్ని గ్రామ సచివాలయాల్లో కల్పిస్తే... తమ జీవనాధారం దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు. మంగళవారం ఈ వ్యాజ్యాలు న్యాయమూర్తి ఎదుటకు రాగా... వివరాలు సమర్పించేందుకు గడువు కావాలని ప్రభుత్వ సహాయ న్యాయవాది కోరారు. ఇప్పటికే పలుమార్లు గడువిచ్చినా స్పందన లేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయస్థానం అంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంతరం... 22 జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ఇవీ చూడండి-పురపాలక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు...!

ABOUT THE AUTHOR

...view details