- హైకోర్టు తీర్పు మేం ఆశించినట్లు లేదు: ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్
- ఉద్యోగుల్లో కరోనా భయం ఎక్కువగా ఉంది: ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్
- టీకా పంపిణీ పూర్తయ్యాక ఎన్నికలు జరపాలని కోరాం: ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి
- కరోనా భయంతో అనేకమంది సెలవుల్లో ఉన్నారు: ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి
- వేలమందికి కరోనా సోకింది, వందలమంది మరణించారు: వెంకట్రామిరెడ్డి
- ప్రస్తుతం ఉద్యోగులకు టీకాల పంపిణీ జరుగుతోంది: వెంకట్రామిరెడ్డి
- ఉద్యోగులకు టీకా ఇచ్చే ప్రక్రియ 2 నెలల్లో పూర్తవుతుంది: వెంకట్రామిరెడ్డి
- రెండు నెలల తర్వాత ఎన్నికలకు మేం సిద్ధమే: వెంకట్రామిరెడ్డి
- సుప్రీంకోర్టులో అప్పీల్ వేయాలని నిర్ణయించాం: వెంకట్రామిరెడ్డి
- ఉద్యోగులపై అంతలా ఒత్తిడి చేసే అవసరం ఏముంది?: వెంకట్రామిరెడ్డి
- ఎన్నికలను మరో 2 నెలలు వాయిదా వేస్తే ఏమవుతుంది?: వెంకట్రామిరెడ్డి
స్థానిక పోరుపై హై కోర్టు కీలక తీర్పు.. ప్రక్రియ కొనసాగించాలని ఆదేశం
13:33 January 21
సుప్రీంకోర్టులో అప్పీల్ వేయాలని నిర్ణయించాం: వెంకట్రామిరెడ్డి
13:32 January 21
స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు
పంచాయతీ ఎన్నికలకు అనుమతించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని గుర్తు చేసింది. ఎన్నికలు ఎలా నిర్వహించాలనే విషయంపై తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని స్పష్టం చేసింది.
'సీఈసీకి ఉన్న అధికారాలే ఎస్‌ఈసీకి ఉన్నాయి. సింగిల్ బెంచ్ తీర్పు ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంది. ఎస్‌ఈసీకి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. ఎన్నికైన నేతలు వ్యాక్సినేషన్‌ను ముందుకు తీసుకువెళ్తారు. వ్యాక్సినేషన్ పేరుతో ఎన్నికల వాయిదా కోరడం సరికాదు. మూడో దశలో భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ ఉన్నందున ఈలోగా ఎన్నికలు సబబే' అని హైకోర్టు స్పష్టం చేసింది.
అమెరికాతో పాటు.. మన దేశంలోనూ చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఉన్న సమయంలోనూ.. ఎన్నికలు జరిగాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఇప్పటికే రెండున్నర ఏళ్లుగా స్థానిక ఎన్నికలు జరగలేదని చెప్పిన హైకోర్టు... టీకాల పేరుతో 2022 వరకు జరపరాదనే ఉద్దేశముందా అనే ప్రశ్న తలెత్తుతోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సహకారం లేకుంటే ఎస్‌ఈసీ మళ్లీ కోర్టుకు రావచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
12:41 January 21
హైకోర్టు తీర్పుపై మాకు గౌరవం ఉంది: మంత్రి కన్నబాబు
స్వార్థ ప్రయోజనాలతో నిమ్మగడ్డ ముందుకెళ్తున్నారు: కన్నబాబు
పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు జరపాలనే పట్టుదలతో ఉన్నారు: కన్నబాబు
కరోనా వేళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు: కన్నబాబు
పంచాయతీ ఎన్నికల్లో ఒక్కచోటైనా గెలిచే స్థితి తెదేపాకు ఉందా?: కన్నబాబు
11:52 January 21
హైకోర్టు తీర్పును స్వాగతించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి ఎస్‌ఈసీకి సహకరించాలి: రామకృష్ణ
- పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: నారాయణ
- కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు జరపాలి: భారత న్యాయవాదుల సంఘం
- జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయి: భారత న్యాయవాదుల సంఘం
- ఎన్నికల సంఘం కేంద్ర బలగాలను కోరాలి: ఐఏఎల్ ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల
11:50 January 21
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాం: ఎస్‌ఈసీ
- వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు: ఎస్‌ఈసీ
- ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది: ఎస్‌ఈసీ
- త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం: ఎస్‌ఈసీ
11:49 January 21
జడ్జిలు మారినంత మాత్రాన న్యాయం మారదు: చంద్రబాబు
- ఎన్నికల సంఘం కూడా వద్దనే రీతిలో వ్యవహరించారు: చంద్రబాబు
- పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలూ వద్దంటారేమో?: చంద్రబాబు
- రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేని వ్యక్తి.. జగన్: చంద్రబాబు
- కరోనా వేళ ఎన్నికలు నిర్వహించాలని చూశారు: చంద్రబాబు
- కరోనా తగ్గాక ఎన్నికలు పెడుతుంటే వద్దంటున్నారు: చంద్రబాబు
11:39 January 21
ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది.
ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది.