జీపీఏ హోల్డర్ ద్వారా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాల్.. పిల్ ఎలా దాఖలు చేస్తారని, అది సెప్టెంబర్ 2020 లో ఇచ్చిన జీపీఏతో ఇప్పుడు ఎలా పిల్ వేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీసింది. న్యాయవాది బాలాజీ వడేరా బదులిస్తూ.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారన్నారు.
డాక్టర్ పాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం ఉపసంహరణ - ఏపీ న్యూస్ అప్డేట్స్
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ పాల్ జీపీఏ హోల్డర్ జ్యోతి బెగల్ ద్వారా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.
AP HIGH COURT
ప్రైవేటీకరణకు ప్రొసీడింగ్స్‌ను బహిర్గతం చేయడం లేదన్నారు. క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. సరైన వివరాలు లేకుండా దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలే మంది, కొట్టేస్తామంది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకొని తగిన వివరాలతో దాఖలు చేసేందుకు స్వేచ్ఛనివ్వాలని న్యాయవాది కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.