ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HC On Social Media Case: సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు.. నిందితుల మరో పిటిషన్​ - bail petition of posting on social media insulting judges

AP HIgh Court on petition of Social Media Case Victims: న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ.. సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అసభ్యకర పోస్టుల కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితులు పిటిషన్​ దాఖలు చేశారు.

ap high court
ap high court

By

Published : Dec 31, 2021, 7:47 AM IST

AP High Court News: న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిలు కోసం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ తీర్పును (రిజర్వు) వాయిదా వేశారు.

ఈ కేసులో శ్రీధర్‌రెడ్డి, వెంకట సత్యనారాయణ. శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, అజయ్‌ అమృత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. వీరి బెయిలు పిటిషన్లను ఇటీవల హైకోర్టు ఒకసారి కొట్టేసింది. వారు తాజాగా హైకోర్టును మరోసారి ఆశ్రయించారు.

ABOUT THE AUTHOR

...view details