వైకాపా ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు - ఏపీ హైకోర్టు న్యూస్
11:58 May 05
హైకోర్టు నోటీసులు
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది పారా కిషోర్ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధులు వ్యాప్తి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు, తీసుకున్న చర్యలపై వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, డీజీపీలను ఆదేశాలు జారీచేసింది. పిల్లో ప్రతివాదులైన వైకాపా ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధనరెడ్డి, రోజా, కిల్వేటి సంజీవయ్య, వెంకటగౌడ, విడదల రజనిలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఇదీ చదవండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్!