రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రానున్నారు. ఈనెల 13న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ జె నివాస్, సీపీ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 2009 డిసెంబర్లో ఛత్తీస్‌గడ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్రా.. ప్రస్తుతం అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నారు.
High Court CJ: 13న హైకోర్టు సీజెేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
అక్టోబరు 13న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు సంబంధింత ఏర్పాట్లను కలెక్టర్ జే నివాస్, సీపీ బి.శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు.
హైకోర్టు నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా