ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెలంగాణ మాదిరే.. ఏపీకి సైతం తగిన నిర్ణయం తీసుకోండి' - ఏపీ హైకోర్టు జడ్జీల సంఖ్య

ఏపీ హైకోర్టులో జడ్జీల సంఖ్య పెంచాలని..హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యనిర్వాహక సభ్యుల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను కోరారు. హైదరాబాద్‌లో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణను మర్యాదపూర్వకంగా కలిశారు.

Ap high court lawyers request  justice nv ramana
జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి

By

Published : Jun 15, 2021, 8:46 AM IST

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యనిర్వాహక సభ్యుల బృందం హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను మర్యాదపూర్వకంగా కలిసింది. సీజేఐగా అత్యున్నత పదవిని అలంకరించినందుకు అభినందనలు తెలిపింది. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచిన మాదిరిగానే ఏపీ హైకోర్టులోనూ పెంచాలని విజ్ఞప్తి చేసింది. సీజేఐని కలిసిన వారిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్‌, ఉపాధ్యక్షుడు జీఎల్‌ నాగేశ్వరరావు, కార్యదర్శి పీటా రామన్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీజేఐని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

సీజేఐని కలిసిన బీబీఏ న్యాయవాదులు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణను సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ) న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. సీజేఐని కలిసిన వారిలో బీబీఏ అధ్యక్షుడు డీపీ రామకృష్ణ, పలువురు మాజీ అధ్యక్షులు మట్టా జయకర్‌, గోగిశెట్టి వెంకటేశ్వరరావు, చిత్తరువు జగదీష్‌, చేకూరి శ్రీపతిరావు, పి.లక్ష్మీకాంత్‌, చలసాని అజయ్‌కుమార్‌, మాజీ పీపీ అక్కినేని వెంకటనారాయణ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:

'రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలి'

ABOUT THE AUTHOR

...view details