పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడే తీర్పని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్ల ఉద్యోగ సంఘాలు వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టిందని ఆయన చెప్పారు. అలాగే ఎస్‌ఈసీ హక్కులను సుప్రీంకోర్టు గుర్తు చేసిందని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయని... ఇప్పటికైనా సర్కార్కు కనువిప్పు కలగాలని లక్ష్మీనారాయణ హితవు పలికారు.
ఎస్‌ఈసీ హక్కులను సుప్రీంకోర్టు గుర్తు చేసింది: లక్ష్మీనారాయణ - ఏపీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ ఈటీవీ భారత్కు వివరించారు.
AP HIGH COURT LAWYER LAKSHMI NARAYANA