రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉందని.. అయినా రెండోసారి అసెంబ్లీలో పెట్టి గవర్నర్ ఆమోదం కోసం పంపారని ఏపీ హైకోర్టు సాధన సమితి ఐకాస కన్వీనర్ ఎన్వీ ప్రసాద్ అన్నారు. రాజధాని నిర్మాణం, తదనంతర పరిణామాలను వివరిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు మెయిల్ ద్వారా లేఖ పంపారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయన్నారు. ఈ అంశం 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని.. అది దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.
అమరావతిపై గవర్నర్‌కు ఏపీ హైకోర్టు సాధన సమితి లేఖ - గవర్నర్‌కు ఏపీ హైకోర్ట్ సాధన సమితి లేఖ
గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఏపీ హైకోర్టు సాధన సమితి ఐకాస లేఖ రాసింది. రాజధాని నిర్మాణం, తదనంతర పరిణామాలను లేఖలో సవివరంగా పొందుపరిచింది. 3 రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.
అమరావతిపై గవర్నర్‌కు ఏపీ హైకోర్ట్ సాధన సమితి లేఖ