ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT NOTICES: రాష్ట్ర డీజీపీ, సీఎస్‌కు హైకోర్టు నోటీసులు - ఏపీ తాజా వార్తలు

AP high court issues notices to CS and DGP
AP high court issues notices to CS and DGP

By

Published : Nov 10, 2021, 12:17 PM IST

Updated : Nov 10, 2021, 1:47 PM IST

11:54 November 10

పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ

పోలీసులు సీఆర్​పీసీలోని 54, 57 సెక్షన్లు పాటించట్లేదంటూ దాఖలైన పిటిషన్​కు సంబంధించి..డీజీపీ, సీఎస్​లకు హైకోర్టు నోటీసులిచ్చింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పోలీసులు సీఆర్​పీసీలోని 54, 57 సెక్షన్ల కింద అదుపులోకి తీసుకుని..చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర వాదించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించాకే విచారించాలని నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనానికి నివేదించారు. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని చట్టంలో ఉందన్నారు. 

ఈ ఏడాది ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం నేత బ్రహ్మం చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం..డీజీపీ, సీఎస్​లకు నోటీసులు జారీ చేసి.. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

LIVE VIDEO : మూతికి నిప్పు.. అలరించబోయి విలపించాడు..!

Last Updated : Nov 10, 2021, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details