ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులపై అట్రాసిటీ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు - అమరావతి రైతుల ఉద్యమం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన 21 మంది రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. రైతుల పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులను తొలగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

amaravati farmers
అమరావతి రైతులపై అట్రాసిటీ కేసులు

By

Published : Jan 25, 2021, 7:12 PM IST

Updated : Jan 25, 2021, 7:23 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్​లో తమపై నమోదు చేసిన ఎస్సీ ,ఎస్టీ కేసును కొట్టేయాలని కోరుతూ రైతులు వేసిన క్వాష్ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. రైతులపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులను తొలగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్స్ 41 ప్రకారం సీఆర్​పీసీ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్స్ వర్తించవని కోర్టు తెలిపింది. రైతులు కులం పేరుతో దూషించలేదని..వారిని ఇరికించేందుకు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాది లక్ష్మీ నారాయణ వాదించారు. ఉద్దండరాయుని పాలెంలో 21 మంది రైతులపై తమ ఇంటిపైకి వచ్చి.. తమను దూషించారని నందిగామ వెంకట్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై అన్యాయంగా కేసు నమోదు చేశారని 21 మంది రైతులు క్వాష్ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Last Updated : Jan 25, 2021, 7:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details