ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. పిటిషనర్ అఫిడవిట్‌ను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని ధర్మాసనం చెప్పినట్టు..... పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఓ ఐపీఎస్ అధికారిని నియమించారని ఆరోపిస్తూ.. పిటిషనర్ దానికి సంబంధించిన వివరాలను అదనపు అఫడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. అయితే ఈ వివరాలను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని కోర్టు సూచించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. గురువారం విచారణలో కోర్టు... ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయలేదని వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా - phone tapping case in ap news
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తదుపరి విచారణను హైకోర్టు.. ఈనెల 27కు వాయిదా వేసింది. గురువారం విచారణలో న్యాయస్థానం.. ప్రభుత్వానికి ఎలాంటి ప్రశ్నలు వేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా