పోలవరం ముంపు బాధితులకు పరిహారం చెల్లించకుండానే పోలవరం గేట్లు బిగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలతో కూడిన అదనపు సమాచారాన్ని పిటిషనర్‌కు కోర్టుకు అందించారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీచేయించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అదనపు సమాచారం, ప్రభుత్వ అఫిడవిట్.. కోర్టు రికార్డుల్లోకి రాలేదని హైకోర్టు తెలిపింది. మరోసారి అదనపు సమాచారం పంపాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.
పోలవరం పనులపై మరోసారి అఫిడవిట్ దాఖలు చేయండి: హైకోర్టు
పోలవరం పనులపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. అదనపు సమాచారం ఇవ్వాలని పిటిషనర్‌కు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
polavaram project works