రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం నిధులు కేటాయించట్లేదని.. నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నిధులలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
వెంటనే నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంత నిధులను కేటాయించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ విషయాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ ను దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది .