ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2021, 4:12 PM IST

Updated : Jan 12, 2021, 5:07 PM IST

ETV Bharat / city

ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్​పై కొనసాగుతున్న విచారణ

ap sec
ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్‌ పై విచారణ

16:09 January 12

హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ

రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసి రిట్ అప్పీల్​పై హైకోర్టు డివిజన్ బెంచ్​లో విచారణ సాగుతోంది. స్థానిక ఎన్నికలపై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఎస్​ఈసీ సోమవారం డివిజన్ బెంచ్​ను ఆశ్రయించింది.

సింగిల్ బెంచ్ ఉత్తర్వులు...

పంచాయతీ ఎన్నికల నిమిత్తం షెడ్యూల్‌ ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ నెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఈసీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న కరోనా టీకా కార్యక్రమానికి, దాన్ని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయం ప్రతిబంధకంగా మారుతుందని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయం.. అధికరణ 14, 21లను ఉల్లంఘించేదిగా ఉందని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని ఆక్షేపించింది. సంప్రదింపుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కమిషన్‌ నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడింది.

డివిజన్ బెంచ్​లో అప్పీల్...

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఇప్పటికే నిర్దేశించిన చట్ట నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులున్నాయని పేర్కొంది. ఓసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఆ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని ఇప్పటికే పలు తీర్పులున్నాయని గుర్తు చేసింది. ఈ అప్పీల్​పై హైకోర్టు డివిజన్ బెంచ్​లో విచారణ సాగుతోంది. 

ఇదీ చదవండి

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల సస్పెన్షన్‌

Last Updated : Jan 12, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details