వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మైనింగ్ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ వేసిన వారిలో ఒకరు మైనింగ్ కేసులో ముద్దాయి అని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఆ అంశంపై విచారణ జరగడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ ఎప్పుడు దాఖలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది.
ఎమ్మెల్యే అంబటి మైనింగ్ కేసుపై విచారణ.. వచ్చే వారానికి వాయిదా
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మైనింగ్ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు ఎప్పుడు చేస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. వారంలో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది బదులివ్వగా... వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది.
mla ambati rambabu illegal mining case
వారంలో కౌంటర్ వేస్తామని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని గతనెల 26న జరిగిన నాటి విచారణలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Last Updated : Sep 22, 2020, 3:27 PM IST
TAGGED:
ap high court news