వివిధ గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలు , మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తూ గతేడాది డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తాజాగా హైకోర్టులో వాదనలు జరిగాయి. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన అంశంపై హైకోర్టులో విచారణ - ఏపీ హైకోర్టు గ్రామాల విలీనం
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామాలను చట్టవిరుద్ధంగా విలీనం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేసింది.
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీన అంశంపై హైకోర్టులో విచారణ
అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, జీవి శివాజీ, పీఎస్పీ సురేశ్ కుమార్, ఎస్. శ్రీనివాసరావు తదితరులు వాదనలు వినిపిస్తూ.. అధికరణ 243 (క్యూ) కు విరుద్ధంగా ఆర్డినెన్స్ జారీచేసే అధికారం గవర్నర్కు లేదన్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని.. గ్రామాల్ని విలీనం చేయాలంటే పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాలిటీ చట్ట నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ఇదీ చదవండి:శ్రీశైలం ఆలయ హుండీకి రూ.4.90కోట్లు ఆదాయం