ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజా ప్రతినిధుల నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టులో విచారణ

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు...వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ap high court
ap high court

By

Published : May 12, 2020, 3:48 PM IST

కరోనాను నియంత్రించేందుకు కేంద్రం విధించిన లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్​​పై హైకోర్టు విచారించింది. కొంతమంది ప్రజాప్రతినిధులు లాక్​డౌన్ నిబంధనలకు పాల్పడుతున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... జనాలు సమూహంగా ఏర్పడేలా తామెవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలా చేసిన వాళ్లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చుకోవచ్చని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం... వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details