అధికారపార్టీకి చెందిన వారు ఇతర పార్టీకు చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, బెదిరించడం, హింసా ఘటనల నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది వేణుగోపాల్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీకి చెందిన వారు భారీ సంఖ్యలో ఏకగ్రీవం అయ్యారన్నారు. నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతల కలిగించిన అడ్డంకులు, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. కేంద్ర ప్రభుత్వానికి 2020 మార్చి 18న సమగ్ర నివేదిక పంపారని గుర్తుచేశారు. అసాధారణ రీతిలో ఏకగ్రీవాలు ఏ విధంగా పెరిగాయో నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. పూర్తి స్థాయి వాదనలు వినేందుకు తగిన సమయం లేకపోవడంతో.. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తెలిపారు. విచారణను వాయిదా వేశారు
పరిషత్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలి.. హైకోర్టులో 'జనసేన' తరఫు న్యాయవాది వాదనలు - ఏపీ హైకోర్టులో జనసేన పిటిషన్ తాజా వార్తలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో జనసేన పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. విచారణ జరిపిన కోర్టు... బుధవారానికి వాయిదా వేసింది.
![పరిషత్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలి.. హైకోర్టులో 'జనసేన' తరఫు న్యాయవాది వాదనలు ap mptc and zptc election notification](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10746052-867-10746052-1614081894829.jpg)
ap local electiosn 2021
Last Updated : Feb 24, 2021, 2:49 AM IST