తనను మీడియాతో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఎమ్మెల్యే జోగి రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎవరితోనూ మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారని ఎస్‌ఈసీ తరుఫు న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు.
వాదనలు విన్న న్యాయస్థానం..జోగి రమేశ్ మీడియాతో మాట్లాడవచ్చని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈనెల 21 వరకు పొడిగించింది. ఎన్నికల ప్రక్రియ, ఎస్ఈసీపై వ్యాఖ్యలు చేయవద్దని ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసింది.