ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని రింగ్ రోడ్డు వ్యవహారంపై హైకోర్టులో విచారణ.. ప్రతివాదులకు నోటీసులు - రాజధాని కేసు న్యూస్

Capital Ring Road Case: రాజధాని రింగ్ రోడ్ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీమంత్రి నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అంగుళం భూమి సేకరించలేదని, అలాంటప్పుడు అనుచిత లబ్ధి కలిగించే ప్రశ్నే తలెత్తదని పిటిషన్‌లో వివరించారు. పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

రాజధాని రింగ్ రోడ్డు వ్యవహారంపై హైకోర్టులో విచారణ
రాజధాని రింగ్ రోడ్డు వ్యవహారంపై హైకోర్టులో విచారణ

By

Published : May 19, 2022, 3:26 PM IST

Capital Ring Road CID Case: రాజధాని అమరావతి రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీమంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార ఎజెండాతో క్రిమినల్ కేసుల్లో ఇరికించి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని పిటిషన్​లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు అంగుళం భూమి సేకరించలేదని.., అలాంటప్పుడు అనుచిత లబ్ధి కలిగించే ప్రశ్నే తలెత్తదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్​ను విచారించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

కేసు నేపథ్యం ఏంటంటే..: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీమంత్రి పొంగూరు నారాయణ, మరికొందరిపై ఈనెల 10న సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఆర్టీరియల్‌ రహదారుల అలైన్‌మెంట్‌ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏప్రిల్‌ 27న ఫిర్యాదు ఇవ్వగా.. దానిపై ప్రాథమిక విచారణ నివేదిక ఈ నెల 6న అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఐపీసీ 120బీ, 420, 34, 35, 36, 37, 166, 167, 217లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13 (1) (ఎ) కింద నిందితులపై అభియోగాలు మోపింది.

ఫిర్యాదు సారాంశం ఇదీ:"2014-19 మధ్య ప్రభుత్వంలో అత్యంత ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు రాజధాని బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. తద్వారా ఆ ప్రభుత్వంలో నిర్ణయాధికారం కలిగిన వారితో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. తద్వారా మోసానికి పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది.

ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొంది వీరినే..
1. చంద్రబాబునాయుడు (అప్పటి ముఖ్యమంత్రి, సీఆర్‌డీఏ ఛైర్మన్‌)

2. పొంగూరు నారాయణ (అప్పటి మంత్రి, సీఆర్‌డీఏ వైస్‌ ఛైర్మన్‌)

3. లింగమనేని రమేశ్

4. లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌

5. కేపీవీ అంజనీకుమార్‌ అలియాస్‌ బాబీ- రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌

6. హెరిటేజ్‌ ఫుడ్స్‌

7. ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌

8. ఎల్‌ఈపీఎల్‌ ఇన్ఫోసిటీ

9. ఎల్‌ఈపీఎల్‌ స్మార్ట్‌ సిటీ

10. లింగమనేని అగ్రికల్చర్‌ డెవలపర్స్‌

11. లింగమనేని ఆగ్రో డెవలపర్స్‌

12. జయని ఎస్టేట్స్‌

13. రామకృష్ణ హౌసింగ్‌

14. ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులు, ఇతరులు

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details