బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 103పై సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారించింది. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో విలీనం చేయటం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించి.. పేద బ్రాహ్మణులకు సాయం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది . తదుపరి విచారణను వాయిదా వేసింది.
GO on Brahmin corporation: రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు - GO 103 on Brahmin corporation
బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో విలీన అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ap high court