ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

high court: బిల్లుల చెల్లింపు వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా - గుత్తేదారులు

అభ్యంతరం లేని బిల్లు చెల్లింపులకు సంబంధించిన పూర్తి నివేదికను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. బిల్లుల చెల్లింపు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ap high court hearing on bills pending issue
బిల్లుల చెల్లింపు వ్యవహారంపై హైకోర్టులో విచారణ

By

Published : Jun 28, 2021, 9:01 PM IST

గతంలో పనిచేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని హైకోర్టు(high court)లో దాఖలైన వ్యాజ్యలపై విచారణ జరిగింది. బిల్లులు(bills) చెల్లింపు వ్యవహారంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, పంచాయతీ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది హాజరయ్యారు. బిల్లులు చెల్లించలేదని కోర్టులకు వచ్చిన గుత్తేదారులు ఇరువురికి పెండింగ్ బిల్లులు చెల్లించామన్నారు.

అభ్యంతరం లేని బిల్లు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని.., దానికి సంబంధిత నివేదికను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details