పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. ఎస్ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అశ్వినీ కుమార్ వాదనలు వినిపిస్తూ... ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితి ఉందన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కొనసాగుతున్న విచారణ - ఏపీ హైకోర్టు తాజా వార్తలు
ఏపీ హైకోర్టు
14:43 January 11
హైకోర్టులో విచారణ ప్రారంభం
హౌస్ మోషన్ పిటిషన్...
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్, ఎన్నికల ప్రవర్తన నియమావళి విధింపు, బదిలీలపై నిషేధం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం... శనివారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఈసీని నిలువరించేలా ఆదేశించాలని.... ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని కోరింది.
ఇదీ చదవండి
Last Updated : Jan 11, 2021, 4:38 PM IST