ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ - ఏపీ తాజా వార్తలు

Anandayya Medicine
Anandayya Medicine

By

Published : May 31, 2021, 3:53 PM IST

Updated : Jun 1, 2021, 2:45 AM IST

15:00 May 31

Anandayya Medicine

ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

నెల్లూరు జిల్లా జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన కొనిడ్ మందుల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పీ, ఎఫ్, ఎల్ ఔషధాల పంపిణీకి తక్షణ సన్నాహక చర్యలు చేపట్టేందుకు ఆనందయ్యకు అనుమతిచ్చింది. కంటి చుక్కలు . 'కె'  మందు విషయంలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ...విచారణను జూన్ 3 కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టీస్  కె.విజయలక్ష్మీ, జస్టీస్ డి. రమేశ్​తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కంటిలో వేసే చుక్కలు, కె. ఔషధం తప్ప అనందయ్య మందు పి, ఎఫ్, ఎల్ పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు...ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్​జీపి) సుమన్ విన్నవించిన అనంతరం హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్​కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధ పదార్ధాలు, ఫార్ములా వివరాల్ని చెప్పాలని అధికారులు వేధిస్తున్నారని, మందు పంపిణీకి అనుమతివ్వాలని పేర్కొంటూ ఆనందయ్య మరో ఇద్దరు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ మూడు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.

హాజరు కావాలని ఆదేశిస్తాం...

ప్రభుత్వం తరపున ఎస్​జీపీ సుమన్ వాదనలు వినిపిస్తూ 'ఆనందయ్య మందు తీసుకున్న 130 మంది నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మందుతో నయం అయితే ఆసుపత్రిలో చేరరు కదా. కోటయ్య అనే విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు తాజాగా  కన్నుమూశారు. ఔషధం సక్రమంగా తయారు చేయకపోతే బ్లాక్ ఫంగస్ కు అవకాశం ఉంది' అని తెలిపారు. బ్లాక్ ఫంగస్​కు అవకాశం ఉందన్న ఎస్​జీసీ వాదనలకు శాస్త్రీయత లేదని హైకోర్టు పేర్కొంది. ఆనందయ్య మందు పంపిణీని నిలువరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఏమైనా ఉత్తర్వులు జారీ చేశారా అని ఎస్​జీపీని  ధర్మాసనం ప్రశ్నించింది. ఆయుష్ శాఖ సేకరించిన నమూనాల నివేదిక ఎక్కడ అని ఆరా తీసింది. ఎస్​జీపీ బదులిస్తూ...మందు పంపిణీని నిలువరించే ఉత్తర్వులేవీ లేవన్నారు. దీంతో ఆగ్రహాం వ్యక్తం చేసిన ధర్మాసనం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను మంగళవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తామని హెచ్చరించింది. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా మందు పంచిపెట్టే కార్యక్రమాన్ని నోటిమాటగా ఏ విధంగా అడ్డుకుంటారని నిలదీసింది. బత్తిన సోదరుల చేపమందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఎస్​జీపీ స్పందిస్తూ..ఆనందయ్య ఔషధ పంపిణీని  ప్రభుత్వం నిలువరించలేదన్నారు. మందు పంపిణీపై ముఖ్యమంత్రి మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారని, విచారణను 3 గంటలకు చేపట్టాలని కోరారు. 3 గంటలకు జరిగిన విచారణలో ఎస్​జీపీ వాదిస్తూ...'ఆనందయ్య మెుత్తం ఐదు రకాల మందులు తయారు చేస్తున్నారు. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా...పీ, ఎఫ్, ఎల్ ఔషధాల పంపిణీకి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 688 మంది ఆయుర్వేద నిపుణులతో మాట్లాడితే ఆనందయ్య మందు వల్ల దుష్ప్రరిణామాలు లేవన్నారు. 'కె'  మందు నమూనాలు సేకరించాక, పరీక్ష ఫలితాలు రావడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది 'కంటి చుక్కల' విషయంలో మరోసారి పరీక్ష నిర్వహించాల్సి ఉంది' అన్నారు.

కంటి చుక్కల మందే కీలకం...

ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ...ఆక్సిజన్ స్థాయి పడిపోయిన వారికి కంటి చుక్కల మందే కీలకమని, దానికి అనుమతివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ...విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నామని..ఈ కొద్ది రోజులు  వేచి ఉండాలని పేర్కొంది. కంటి చుక్కలు, 'కె'  ఔషధం విషయంలో గురువారం నాటికి పూర్తి వివరాలతో  నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలంటే హాస్యంగా ఉందా?

ఆనందయ్య ఔషధంపై పురోగతి ఏమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని గత విచారణలో కోరామని ధర్మాసనం గుర్తు చేసింది. ఔషధం తయారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని తెలియజేస్తూ కేంద్రం తరపు సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్​జీ) హరినాథ్ మెమో దాఖలు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే హాస్యంగా ఉందా? అని ఘాటుగా వ్యాఖ్యనించింది. ఏఎస్​జీ స్పందిస్తూ...అసలు మందు తయారీకి అనుమతి కోరుతూ ఆనందయ్య కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తే చేయలేదన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 1, 2021, 2:45 AM IST

ABOUT THE AUTHOR

...view details