ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Farmers Maha Padayatra: అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి - అమరావతి ఉద్యమం వార్తలు

Farmers Maha Padayatra
Farmers Maha Padayatra

By

Published : Oct 29, 2021, 4:12 PM IST

Updated : Oct 29, 2021, 4:30 PM IST

16:09 October 29

నవంబర్‌ 1 నుంచి 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర'

అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది(high court green signal for armers maha padayatra news). రైతులు నవంబర్‌ 1 నుంచి 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర' కార్యక్రమాన్ని(amaravati farmers maha padayatra news) తలపెట్టారు. శాంతిభద్రతల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి లేదన్న డీజీపీ ప్రకటనపై అమరావతి ఐకాస.. హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. రైతుల మహా పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

1వ తేదీ నుంచి డిసెంబర్ 17 వరకు..
అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసేందుకు.. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 17 వరకు పాదయాత్ర చేపట్టాలని రైతు ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పేరిట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం పోలీసుల అనుమతి కోరారు. కానీ డీజీపీ అనుమతి నిరాకరించటంతో హైకోర్టును ఆశ్రయించారు.

అనుమతి నిరాకరణపై.. డీజీపీ ఏమన్నారంటే
‘న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌(dgp goutham sawang) అన్నారు. అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసేందుకు దీనికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారైన అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు ఈ మేరకు గురువారం ఆయన లేఖ రాశారు. పార్టీలపరంగా చీలిపోయిన గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు అక్కడి పరిణామాలు ఘర్షణలకు దారితీయొచ్చని, అప్పుడు శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఆ లేఖలో వివరించారు. ఇది మూడు రాజధానుల అమలు కోరుకునే ప్రాంత ప్రజల్లో శతృత్వానికి కారణమవుతుందని వివరించారు. 47 రోజుల పాటు భారీ పరివారంతో సాగే ఈ యాత్రకు పోలీసు భద్రత కల్పించటం కష్టమని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆ లేఖలో చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు.. అనుమతిని ఇచ్చింది.

ఇదీ చదవండి:

CM Jagan: ప్రతీ గ్రామంలోని డిజిటల్‌ లైబ్రరీకి.. ఇంటర్నెట్‌ ఇవ్వండి: ముఖ్యమంత్రి జగన్

Last Updated : Oct 29, 2021, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details