నేటి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు పరీక్షలు - poly technic notifications latest
నేటి నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు పరీక్షలు జరగనున్నాయి. వీటికి హైకోర్టు అనుమతించింది. 2018 డిసెంబర్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయగా... దివ్యాంగులకు 4 శాతం కేటాయించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
![నేటి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టు పరీక్షలు polytechnic lecturer posts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6376178-53-6376178-1583954055569.jpg)
నేటి నుంచి జరగాల్సిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతించింది. దివ్యాంగుల కోటా కింద 4 శాతం పోస్టుల్ని భర్తీ చేయకుండా పక్కన పెట్టాలని మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఇచ్చింది. 2018 డిసెంబర్‌లో 405 లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో దివ్యాంగులకు పోస్టులు కేటాయించకపోవటాన్ని హైకోర్టు ఆక్షేపించింది. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉందని ఏపీపీఎస్సీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకురావటంతో... న్యాయమూర్తి పరీక్ష నిర్వహణకు వెసులుబాటు కల్పించారు.