ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాజ్యం.. కొట్టివేసిన హై కోర్టు - జేసీపై వాహనాల రిజిస్ట్రేషన్ కేసు వార్తలు

వాహనాల రిజిస్ట్రేషన్ కేసుపై హైకోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య, కుమారుడు దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసింది. అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

jc prabhakar reddy
జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాజ్యం కొట్టివేత

By

Published : Feb 12, 2021, 8:15 AM IST

వాహనాల రిజిస్ట్రేషన్‌ విషయంలో ఒకే తరహా ఆరోపణలు ఉన్నప్పుడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల నమోదు సరికాదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ఉమారెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు విచారణ చేసింది.

అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. నేర ఘటనలు వేర్వేరుగా చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకే కేసుగా పరిగణించలేమని తెలిపింది. ఈ ఘటనల్లో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలు, వాహనాల పాత్ర ఉందని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

ABOUT THE AUTHOR

...view details