వలస కార్మికులకు సంబంధించి సీపీఐ నేత రామకృష్ట దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. కార్మికుల తరలింపునకు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వలస కార్మికుల సంరక్షణ కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపింది. కార్మికుల తరలింపుపై పర్యవేక్షణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
'వలస కూలీల తరలింపునకు ఏర్పాట్లు చేయండి' - వలస కూలీల తరలింపు వార్తలు
వలస కార్మికుల తరలింపునకు బస్సులు, రైళ్లు ఏర్పాట్లు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ap high court