ఉపాధిహామీ పథకం పెండింగ్ బిల్లులు(NREGS bills news) చెల్లించాలని దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గుత్తేదారులకు నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బకాయిలు చెల్లించటంలో కావాలని నిర్లక్ష్యం చేశారని పిటీషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదించారు . వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఇప్పటికే తీర్పు ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం నాలుగు వారాల్లోగా చెల్లించాలని తీర్పునిచ్చింది. పిటీషన్లపై వాదనలు ముగించింది.
NREGS bills: గుత్తేదారులకు 4 వారాల్లో నగదు చెల్లించండి: హైకోర్టు - హైకోర్టు
ఉపాధిహామీ పథకం పెండింగ్ బిల్లుల చెల్లింపులపై హైకోర్టు విచారణ జరిపింది(NREGS bills of contractors in ap news). గుత్తేదారులకు నాలుగు వారాల్లో బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది.
NREGS bills of contractors