ఆ వాహనాల విడుదలపై డీజీపీ కోర్టుకు హాజరుకావాలి: హైకోర్టు - అక్రమ మద్యం రవాణా సీజ్ వాహనాల వార్తలు
15:19 June 23
అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై హైకోర్టులో విచారణ
మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని సీజ్ చేసిన వాహనాల విడుదల అంశంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయటంలో నిబంధనలు పాటించట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై డీజీపీ వివరణ తీసుకుని తమకు తెలియజేయాలని గత విచారణలో కోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది చేప్పిన వివరణతో సంతృప్తి చెందని.. ధర్మాసనం రేపు డీజీపీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
హెబియస్ కార్పస్ కేసుకు సంబంధించిన విచారణ కోసం గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. తమను అక్రమంగా అరెస్టు చేశారని గతంలో రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచి అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో డీజీపీ హైకోర్టుకు హాజరయ్యారు.. ఇప్పుడు మరోసారి ధర్మాసనం కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
TAGGED:
ఏపీ హైకోర్టు తాజా వార్తలు