ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విచారణ ప్రత్యక్ష ప్రసారానికి ఆదేశాలు ఇవ్వలేం

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాలపై తుది విచారణ ప్రత్యక్ష ప్రసారానికి ఆదేశాలు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి అభ్యర్థనలను వివిధ హైకోర్టులు తిరస్కరించినట్లు హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ స్పష్టం చేశారు.

ap high court on amaravathi issue
ఏపీ హైకోర్టు

By

Published : Nov 5, 2020, 7:41 AM IST

రాజధాని అమరావతి వ్యవహారంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాలపై తుది విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిటిషన్‌లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి అభ్యర్థనలను వివిధ హైకోర్టులు తిరస్కరించినట్లు హైకోర్టు తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ తెలిపారు. ప్రతివాదుల జాబితాలో వివరాల్ని సక్రమంగా పేర్కొనలేదన్నారు.

ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. సవరణ చేసేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇస్తూ డిసెంబర్‌ 1కి విచారణ వాయిదా వేసింది. రాజధాని వ్యాజ్యాల విచారణను ప్రత్యక్షప్రసారం చేసేందుకు వీలుగా ఆదేశాలివ్వాలని కోరుతూ.. విజయవాడకు చెందిన వేమూరు లీలాకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు.

ఇదీ చదవండి: భూముల రీ-సర్వేకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details