పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాలు ప్రభుత్వానికి చెందినవని.. వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున్న రంగులు తొలగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని... కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5 కి వాయిదా వేసింది.
'పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించండి' - ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగుల వార్తలు
పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.
ap high court comments on colours to panchayath offices
ఇదీ చదవండి : మండలికి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం