ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్ల కుదింపునకు వీలు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది మే 11న జారీ చేసిన జీవో 23 ను సవాలు చేస్తూ కొన్ని కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. గతంలో 720 మంది విద్యార్ధులను గరిష్టంగా చేర్చుకునే వీలుండేదని పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం వల్ల 9 సెక్షన్లకు 40 మంది విద్యార్ధుల చొప్పున 360 మందిని మాత్రమే చేర్చుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపాయి.
ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సీట్ల కుదింపుపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి విద్యార్ధుల ప్రవేశాల్లో సీట్లు కుదించడంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
ap high court
కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన క్రమంలో కళాశాలలో సీట్లను పెంచాలే తప్ప తగ్గించేందుకు వీల్లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విన్నవించారు. ప్రభుత్వ కళాశాల్లో తగ్గించకుండా.. ప్రైవేటు కళాశాలల్లో తగ్గించడానికి కారణం ఏమిటని న్యాయమూర్తి.. ప్రభుత్వ సహాయన్యాయవాదిని ప్రశ్నించారు. అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు హాజరుకావాలని ఆదేశించారు.
ఇదీచదవండి:నవంబరు 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం