గ్రానైట్ లీజు గరిష్ఠ కాల పరిమితిని 20 ఏళ్లకు పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ మైనింగ్ మినరల్ కన్‌సెషన్ నిబంధనను హైకోర్టు తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రానైట్ రూల్స్ ప్రకారం, కాంపీటెంట్ అథార్టీ లీజు కాల పరిమితిని 20 నుంచి 30 ఏళ్లకు నిర్ణయించే విలుందని తెలిపింది. ఇది ఏపీ మైనింగ్ మినరల్ రూల్స్ కాంపీటెంట్ అథార్టీకి ఉన్న విచక్షణాధికారాన్ని లాగేసుకోవడమేనని పేర్కొంది. గ్రానైట్ లీజు కాలం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గ్రానైట్ రూల్ 6కి అనుగుణంగా ఉండాలి తప్ప.. ఏపీ మైనర్ మినరల్ రూల్ 12(5)(హెచ్) ప్రకారం ఉండటానికి వీల్లేదంది.
రాష్ట్రంలో గ్రానైట్ లీజు కాలపరిమితి కుదింపుపై హైకోర్టు ఆగ్రహం - HC on granite lease period
రాష్ట్రంలో గ్రానైట్ లీజు కాలపరిమితిని 20 ఏళ్లకే పరిమితం చేస్తూ.. ప్రభుత్వం చేసిన నిబంధనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రప్రభుత్వ చర్యలు కేంద్ర నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని... లీజు గడువు కుదించడానికి వీల్లేదని న్యాయస్థానం తెలిపింది.
granite