వెనుకబడిన వర్గాలపై దాడి కేసులో ఉన్నవారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జై భీం యాక్సిస్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది శ్రవణ్ కుమార్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితులకు మేనమామగా ఉంటానని మాయమాటలు చెప్పి.. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక దళితులపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వర్గాలపై దాడులు చేసిన వ్యక్తుల్ని కాపాడుతూ, పదవులు కట్టబెడుతుంటే.. దళితులు మీ వెనుక ఎందుకు నిలబడాలని ప్రశ్నించారు. బాధితులపై కేసులు పెట్టె సంస్కృతిని వైకాపా ప్రభుత్వం చేస్తుందన్నారు. తోట త్రిమూర్తుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
తోట త్రిమూర్తులు అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోండి: శ్రవణ్ కుమార్ - ఎమ్మెల్సీగా తోట త్రిమూర్తుల
దళితులపై దాడి కేసులో ఉన్న వారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. వెంటనే తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ap high court advocate sravan kumar