ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై హెల్త్​ బులెటిన్​ విడుదల.. రాష్ట్రంలో ఐదుగురికి పాజిటివ్​ - corona health bulleten news in ap

రాష్ట్రంలో ఇప్పటివరకూ ఐదుగురికి కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది. ఇప్పటికే 11,640 మందికి స్క్రీనింగ్​ పూర్తయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విదేశీయులను అధికారులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. మరోవైపు వైరస్​ వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు.

కరోనాపై హెల్త్​ బులెటిన్​ విడుదల.. రాష్ట్రంలో ఐదుగురికి పాజిటివ్​
కరోనాపై హెల్త్​ బులెటిన్​ విడుదల.. రాష్ట్రంలో ఐదుగురికి పాజిటివ్​

By

Published : Mar 22, 2020, 11:32 AM IST

కరోనా విస్తృతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం ఐదుగురికి కరోనా పాజిటివ్‌ ధ్రువీకరణ అయింది. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది. విశాఖ విమానాశ్రయం, ఓడరేవు వచ్చిన 11,640 మందికి స్క్రీనింగ్ పూర్తయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులకు అధికారులు క్షుణ్ణంగా పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రానికి 12,953 మంది విదేశీ ప్రయాణికులు వచ్చినట్టు గుర్తించారు. 2,052 మంది ప్రయాణికులను క్వారంటైన్‌లో 28 రోజుల పరిశీలన చేస్తున్నారు. మరో 10, 841 మందిని హోం ఐసోలేషన్ విధానంలో పరీక్షిస్తున్నారు. ఇప్పటికే.. 60 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. వీరందరిలో 160 మంది అనుమానితుల నమూనాలను పరీక్షలకు పంపారు. అందులో.. 130 మందికి కరోనా నెగిటివ్‌గా తేలింది. మిగిలినవారి నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

జనతా కర్ఫ్యూపై...

రాత్రి 9 వరకు ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని వైద్య ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు మూసివేయాలని కోరింది. సాయంత్రం 5 గంటలకు స్థానిక అధికారులు సైరన్‌ మోగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి.

ఇదీ చూడండి:

ఆధ్యాత్మిక కేంద్రంలో కనిపించని భక్త జన సంద్రం

ABOUT THE AUTHOR

...view details