రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు నవ్యావిష్కరణల రూపకల్పనలో మరోసారి జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. నీతి ఆయోగ్ ‘అటల్ ఇన్నోవేషన్ మారథాన్ 2019-20’లో భాగంగా నిర్వహించిన పోటీకి రాష్ట్రం నుంచి 12 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇవన్నీ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు రూపొందించినవే కావడం గమనార్హం.
నవ్యావిష్కరణల పథంలో 'గురుకులాలు'
నీతి ఆయోగ్ ‘అటల్ ఇన్నోవేషన్ మారథాన్ 2019-20’లో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో..ఏపీ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థుల ప్రతిభ
దేశవ్యాప్తంగా మొత్తం 3,500 ప్రాజెక్టులు పోటీ పడగా అందులో 150 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో నవ్యావిష్కరణల రూపకల్పనను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో నీతి ఆయోగ్ ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్’ను ప్రారంభించి ఏటా మారథాన్ నిర్వహిస్తోంది.
ఇవీ చదవండి:ఇకనుంచి రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు